హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెచ్ఐవిపై అవగాహన కలిగి ఉండాలి'

AKP: మాడుగుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్‌ మరిడేష్‌ మాట్లాడుతూ.. అసురక్షిత లైంగిక సంబంధాలు, పరీక్షించని రక్తం ఎక్కించుకోవడం, కలుషిత సూదులు వినియోగించడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు.