హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలోకి పాములు.. ఆందోళనలో తల్లిదండ్రులు

VKB: మున్సిపల్ పరిధిలోని జాంబాపూర్ ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల ఆవరణలోకి పాములు, కుక్కలు, పశువులు వస్తుండటంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కౌన్సిలర్ స్పందించి వెంటనే కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.