హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొల్లపల్లిలో ఘనంగా గాయత్రీ మాత కుంకుమార్చన

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘంలో నిర్వహిస్తున్న శ్రీ విరాట్‌ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గాయత్రీ మాత కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. శచీదేవి సహిత ఇంద్ర మూర్తి పూజ, శ్రీ సూక్త హవనం, విశ్వకర్మ హోమం చేపట్టారు. మహిళలు కుంకుమార్చన చేయగా, వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.