WNG: అమరచింత శ్రీకృష్ణనగర్‌లో ఈనెల 20న ఉదయం 10 గంటలకు కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ నేతలు తెలిపారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. సీపీఐ నేతలు అబ్రహం, శ్రీహరి, రవీందర్ మాట్లాడుతూ.. జ్యోతి మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. సభకు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరవుతారని అన్నారు.
తెలంగాణ
కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభ..!


