SKLM: కొత్తరోడ్డు నుంచి అరసవిల్లి వరకు ఉన్న రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. సాగునీటికి ఆటంకం కలుగుతోందని రైతులు వినతి మేరకు జేసీబీలతో పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి పొలానికి సాఫీగా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రపు డెక్కల తొలగింపు పనులు ప్రారంభం


