హైదరాబాద్: 28°C
తెలంగాణ

బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

NRPT: జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ గుట్ట తఫీ బాబా జాతర, గణేష్ నిమజ్జనం ఒకే రోజు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వినీత్ పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో పండుగలు జరుపుకోవాలన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.