హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహీంఖాన్ గూడెంలో గొర్రెల అపహరణ

BHNG: బీబీనగర్ మండలం రహీంఖాన్గాూడెంలో గొర్రెల కాపరి పేరబోయిన మల్లేష్కు చెందిన 30 గొర్రెలు అపహరణకు గురయ్యాయి. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని దొడ్డిలో ఉంచిన గొర్రెలు బుధవారం ఉదయం కనిపించలేదు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, గొర్రెల కాపరుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేష్ బాధితుడిని పరామర్శించారు.