కోనసీమ: కొత్తపేట మండలం చిన్న గుల్లపాలెం గ్రామానికి చెందిన దివంగత టీడీపీ కార్యకర్త వాసంశెట్టి వెంకన్న కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పరామర్శించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త కుటుంబానికి బీమా చెక్ అందజేత


