హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగన్న మృతి తీరని లోటు.. ఎమ్మార్పీఎస్ నివాళి!

KRNL: రామకొండ గ్రామానికి చెందిన నాగన్న మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య అన్నారు. బుధవారం నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జాతి ఉద్యమానికి నాగన్న అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. తన కుమారుడిని ఉద్యమానికి అంకితం చేసిన తండ్రిగా నాగన్న చరిత్రలో నిలిచిపోతారన్నారు.