హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాయకపోడ్ సేవా సంఘం ఏకగ్రీవ ఎన్నిక

BHPL: కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నాయకపోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా గుంటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా తైనేని శంకర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మేసినేని రాజన్న నియామక పత్రాలు అందజేశారు. కులస్తుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపారు.