హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనులకు న్యాయం చేయాలని వినతిపత్రం

NLG: దేవరోని తండాకు చెందిన గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి తొలగించకుండా, వారికి న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం దేవరకొండలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గిరిజన కుటుంబాలు తండా పరిధిలోని భూముల్లో ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు.