హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ యార్డులో జంబో షెడ్‌కు శ్రీకారం

KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షల నాబార్డు నిధులతో నిర్మించనున్న జంబో షెడ్‌కు ఎమ్మెల్యే బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో త్వరలో రూ.1.5 కోట్లతో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల పంటల నిల్వకు కోల్డ్ స్టోరేజ్, వేర్‌హౌస్‌తో పాటు యార్డు భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.