అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరు గ్రామంలో వినాయక మండపం వద్ద విద్యుదాఘాతానికి గురై కురుబ ప్రతాప్ (20) అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. వినాయక మండపం వద్ద విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడి మండపంలో యువకుడి మృతి


