హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షుద్రపూజల బెదిరింపు.. వ్యక్తి హత్య

BDK: ఆళ్లపల్లి మండలం మార్కోడ్‌ శివారులోని జల్లేరు వాగు వద్ద ఈ నెల 11న జరిగిన పూనేం నారాయణ హత్య కేసులో సుద్దరేవుకు చెందిన కొమరం రామనాథంను పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడు, మనవరాలిని క్షుద్రపూజలతో చంపుతానని నారాయణ బెదిరించడంతో ఆగ్రహించిన రామనాథం కత్తితో పొడిచి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకన్నబాబు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.