హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలనీలాల వేలం రూ.18.75 లక్షలకు పాట

BDK: పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మగుడిలో ఆలయ ఈవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తలనీలాల సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహించారు. అమ్మవారికి భక్తులు సమర్పించే తలనీలాలు సేకరించుకునే 11 నెలల లైసెన్స్ హక్కు కోసం 12 మంది పోటీపడగా గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన జగన్నాథం ఏడుకొండలు రూ.18.75 లక్షలకు దక్కించుకున్నట్లు ఈవో తెలిపారు.