హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో గోల్డ్ చోరీ.. నిందితుడి అరెస్ట్!

GNTR: తెనాలిలో యువతిని మోసగించి బంగారు ఆభరణాలు తీసుకున్న కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న ఫిర్యాదు అందగా దర్యాప్తు చేపట్టి బుధవారం పవన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారు గొలుసు, ఉంగరాలు, ఒక జత వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీంద్ర బాబు తెలిపారు.