హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పీకర్‌కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేఖ

JN: అసెంబ్లీలో 22A భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. మంత్రి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తన లేఖలో స్పష్టం చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.