MDK: గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్‌లో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, విద్య, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ప్రతి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ విమర్శలు


