హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రైవర్‌కు ఫిట్స్.. అదుపుతప్పిన DCM

WGL: వర్ధన్నపేట పట్టణంలో డీసీఎం డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. వరంగల్ రాంపూర్ లిక్కర్ డిపో నుంచి మద్యాన్ని రాయపర్తి వైపు తరలిస్తుండగా ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. వాహనం వేగంగా ఉండటంతో ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.