హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు

కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో భాగంగా నగరంలోని 42, 49, 13వ డివిజన్లలో రూ.1.85 కోట్ల UIDF, మున్సిపల్ సాధారణ నిధులతో పలు సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపనలు చేశారు. నాణ్యతతో పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.