హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కృష్ణా: బాపులపాడు మండలం పెరికేడు అంగన్‌వాడీ ప్రీ-ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న ప్రీ-ప్రైమరీ విద్య, ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ (ECD) స్క్రీనింగ్‌ను పరిశీలించారు. నవచేతన యాప్‌లో ఏఐ ఆధారిత స్క్రీనింగ్ వివరాల నమోదును స్వయంగా చూశారు. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.