హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించండి'

KKD: MPTC, ZPTC ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ZP CEO లక్ష్మణరావు కోరారు. బుధవారం కాకినాడ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా తయారీ అంశాలను నేతలకు సమగ్రంగా వివరించారు.