హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓజోన్ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాటాడారు. భూమిపై జీవరాశుల మనుగడకు ఓజోన్ పొర అత్యంత కీలకమైనదని, సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను ఓజోన్ పొర రక్షిస్తుందన్నారు.