CTR: పాలసముద్రం మండలం ఎస్కేఆర్ పురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఆరు నెలలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. తాగునీటి కోసం ప్రస్తుతం కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి కోసం గ్రామస్థుల అవస్థలు


