హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరుట్లలో అంగన్‌వాడీ టీచర్ల నిరసన

జగిత్యాల జిల్లా కోరుట్లలో అంగన్‌వాడీ టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొత్త బస్టాండు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ అన్నం లక్ష్మి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వే కార్యక్రమాల్లో అంగన్‌వాడీలను భాగస్వాములను చేసి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.