GDWL: 2025–26 ఆర్థిక సంవత్సరానికి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి నిధుల కేటాయింపులు లేవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. పథకాల పేరుతో మంజూరు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు అడిగితే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
దివ్యాంగ ఉపకరణాలకు నిధుల్లేవు: కలెక్టర్


