హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు కొత్త అంగన్‌వాడీ భవనం

RR: సిద్దాపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. NREGS నిధులు మంజూరు కావడంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని చిన్నారులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.