హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారతమ్మకు ఎమ్మెల్యే రేవూరి నివాళులు

WGL: సంగెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి తల్లి చొల్లేటి భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం భారతమ్మ అంతిమయాత్రలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.