SDPT: బెజ్జంకి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా కత్తి రమేష్, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా దోనె వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వారిని శాలువాలతో సత్కరించి, నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. మానాల రవి, రమేష్ ఉన్నారు.
తెలంగాణ
'నూతన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి'


