హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి'

BDK: జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫామ్స్ అందించాలని AISF జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ డిమాండ్ చేశారు. మండలంలోని పలు విద్యాసంస్థల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా యూనిఫామ్స్ అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి యూనిఫామ్స్ అందించాలని కోరారు.