MDK: మెదక్ పట్టణంలోని న్యూ హైస్కూల్‌లో ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తుల నాణ్యతపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుస్తులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, కుట్టు పనితనం సరిగా లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దుస్తులు ఎక్కువ కాలం ఉపయోగపడేలా నాణ్యమైన వస్త్రంతో తయారు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ దుస్తుల నాణ్యత పై విద్యార్థుల అసంతృప్తి


