హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పనులు త్వరగా పూర్తి చేయాలి'

ATP: కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో భాగంగా పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జంతలూరు–కొర్రపాడు మార్గంలో ప్రహరీ గోడ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి కోసం మూడు నూతన బోర్లు వేయాలని, భూమి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.