NZB: ఇందల్వాయి మండలం గన్నారం శివారులో పెద్ద చెరువులో పడిపోయిన మేఘ్య నాయక్ తండాకు చెందిన కాట్రాజ్ మంగ్య (58) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న తన కుమారుడితో కలిసి పశువుల కాపలాకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. కుమారుడి సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ జాలర్లు మృతదేహన్ని బయటకు తీశారు.
తెలంగాణ
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం


