హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి ఇంటికీ పైపులైన్ ద్వారా సురక్షిత నీరు'

CTR: జల జీవన్ మిషన్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి DWSM సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.