ప్రకాశం: కంభం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, ఓటర్ల కేటాయింపు, కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు చర్చించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో ఎంపీటీసీ ఎన్నికలపై సమావేశం


