హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVU పీజీ ఫలితాలపై SFI ఆగ్రహం

TPT: SVU పరిధిలో 2025–26 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన పీజీ 1వ, 3వ, 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ టాటా నరసింగరావుకు వినతిపత్రం అందజేశారు. పీజీ పరీక్షలు నిర్వహించి దాదాపు ఏడు నెలలు గడిచినా ఫలితాలు విడుదల చేయకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.