హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

SRD: సంగారెడ్డి పట్టణంలో ఈనెల 18 నుంచి 20 వరకు యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర విద్యారంగంపై ప్లీనరీ సమావేశాల్లో పూర్తిస్థాయి చర్చ జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.