SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని కేజీబీవీలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 'బేటీ బచావో- బేటీ పడావో'లో భాగంగా బుధవారం పోషకాహార అవగాహన సదస్సు నిర్వహించారు. కిశోర బాలికలకు పౌష్టికాహారం, రక్తహీనత నివారణ ఆవశ్యకతను అధికారులు వివరించారు. అనంతరం విద్యార్థినులకు న్యూట్రిషనల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ సరస్వతి, వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కేజీబీవీలో పోషకాహార అవగాహన సదస్సు


