హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌడమ్మగుట్టలో నీటి వృథా

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 25వ వార్డు చౌడమ్మగుట్ట టెంపుల్ ముందు మిషన్ భగీరథ పైప్లాన్ 20 రోజులుగా పగిలి నీరు వృథాగా పోతోంది. తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్లాన్ లీకేజీతో చుట్టుపక్కల ఇళ్లకు నీరు అందడం లేదని తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, మరమ్మతులు చేపట్టాలని కోరారు.