హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

VSP: ప‌ద్మనాభం మండలం అయినాడ గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాగితో పాటు బొబ్బర్లు, కందులు, పెసలు, మినుములు, గంటెలు, జొన్న తదితర అనుబంధ పంటలను సాగు చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చని రైతులకు వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరులతో సాగు చేయాలని సూచించారు.