హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేసీ

NDL: డోన్ పట్టణంలోని MRO కార్యాలయాన్నిఈ రోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ సమస్యలను నిర్ణిత గడువులో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.