ADB: ఆదిలాబాద్ బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు 60 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా 200 మందిని ఎంపిక చేశారు. వీరిలో 150 మంది కానిస్టేబుల్, 50 మంది ఎస్‌ఐ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 17, 18 తేదీల్లో బీసీ సర్కిల్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఎంపికైన వారికి రేపు సర్టిఫికెట్ వేరిఫికేషన్


