హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ..!

BHNG: చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌.సూరయ్య ఆధ్వర్యంలో, సర్పంచ్‌ సుర్వి మల్లేష్‌గౌడ్‌ సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగింది. గ్రామంలోని 2 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 1,427 మంది ఓటర్లు ఉండగా.. అర్హత లేని 94 ఓట్లను తొలగించారు.