హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

MBNR: బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన వసుపుల యాదయ్య (45) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న 1997-98 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మృతుడి భార్యను పరామర్శించి రూ.21 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇందులో BRS మండల నాయకుడు దన్నాడా నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.