MDK: పెద్ద శంకరంపేట మండలం కోళ్లపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోళ్లపల్లి నుంచి పెద్ద శంకరంపేట వైపు వెళ్తున్న ఆటోను వెనకాల నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ లారీ


