MDCL: కానాజిగూడ డైరీఫామ్ రోడ్డులోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వికట గణపతి అవతారంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఈ వివరాలు తెలిపారు. స్వామివారికి 32 ద్రవ్యాలతో విశేష అభిషేకం, మహా గణపతి శతమోదక హోమం, లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, సుదర్శన హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
32 ద్రవ్యాలతో గణపతికి విశేష అభిషేకం


