హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రైతుల పాలాభిషేకం.. ఎందుకంటే?

VKB: పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో 160 ఎకరాల పట్టా భూములను TGIIC స్వాధీనం చేసుకోవద్దని అసెంబ్లీలో ప్రస్తావించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ పులేందర్ ఆధ్వర్యంలో పట్టా రైతులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. తమ భూముల సమస్యను అసెంబ్లీలో లేవనెత్తడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.