హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర శివార్లలో 4 కొత్త బస్ టెర్మినల్స్

RR: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్‌కేసర్‌లో కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దూరప్రాంత, ప్రైవేట్ బస్సులను నగర శివార్లలోని ఈ టెర్మినల్స్ వద్దే నిలిపివేయనున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు లాస్ట్-మైల్ కనెక్టివిటీ సదుపాయం కల్పించనున్నారు.