హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదర్మాట్ బ్యారేజీ వద్ద జనరేటర్ బ్యాటరీలు చోరీ

NRML: మామడ మండలం పోనకల్ సదర్మాట్ బ్యారేజీ వద్ద జనరేటర్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఉన్నతాధికారులు బ్యారేజీని పరిశీలించారు. ఈ క్రమంలో నిన్న నీటి విడుదలకు వెళ్లిన నీటిపారుదల శాఖ అధికారులు జనరేటర్లు పనిచేయకపోవడంతో పరిశీలించగా 4 బ్యాటరీలు కనిపించలేదు. ఘటనపై స్థానిక పోలీస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు.