హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువును పక్కనపెట్టి నీటి కోసం కుస్తీ

MDCL: పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. చదువును పక్కనపెట్టి నీటిని తరలించే పనుల్లో నిమగ్నమవుతున్నారు. సమీపంలోని ట్యాంక్ నుంచి పైపు సాయంతో నీటిని తీసుకురావడానికి విద్యార్థులతో ఎండలో పనులు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో ఇలా పనులు చేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.